కార్తికేయ “భజే వాయు వేగం” టీజర్… ఎప్పుడంటే ..!

Karthikeya's
Karthikeya's "Bhaje Vayu Veli" Teaser... When ..!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ చివరిసారిగా బెదురులంక 2012 లో అందరికి కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇటీవల తన తదుపరి ప్రాజెక్ట్ భజే వాయు వేగం ని అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అందరినీ బాగా ఆకట్టుకుంది. మేకర్స్ ఇప్పుడు ఈ మూవీ నుండి టీజర్ విడుదల పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. రేపు మధ్యాహ్నం 2:25 గంటలకి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

Karthikeya's "Bhaje Vayu Veli" Teaser... When ..!
Karthikeya’s “Bhaje Vayu Veli” Teaser… When ..!

ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. కార్తికేయ చేతిలో బ్యాట్ తో ఉండి, పరిగెడుతున్న పోస్టర్ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. రధన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.