సుదీప్ కు విలన్ గా నటించబోతున్న కమెడియన్ ..!

సుదీప్ కు విలన్ గా నటించబోతున్న కమెడియన్ ..!
Cinema News

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు విలన్ గా నటించబోతున్నారు కమెడీయన్‌ సునీల్. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్. 2022లో విక్రాంత్ రోన మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ ప్రాజెక్టు తర్వాత సుదీప్ చేస్తున్న తాజా సినిమా మాక్స్. విజయ్ కార్తికేయన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

సుదీప్ కు విలన్ గా నటించబోతున్న కమెడియన్ ..!
Max Movie

అయితే ఈ మధ్య సునీల్ ఈ సినిమా లో నటిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కలయిపులి ఎస్ థాను అనౌన్స్ చేశాడు. విజయ్ కార్తికేయ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సునీల్ ను మ్యాక్స్ లోకి తీసుకోవడంపై కన్నడ సినీ అభిమానుల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. సినిమాకు సునీల్ ఆదనపు బలం అవుతాడని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇప్పటికే పుష్ప, జైలర్ లాంటి మూవీ ల్లో విలన్ పాత్రలతో మెప్పించిన సునీల్ కు…. ఇప్పుడు శాండల్ వుడ్ నుంచి పిలుపు రావడం విశేషం.