పహిల్వాన్ పోరాటం

pahalwan in telugu

సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా కన్నడ చిత్రం పహిల్వాన్ అదే పేరుతో తెలుగులో అనువాదమవుతున్నది. ఎన్.కృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలన చిత్రం సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఆగస్ట్ 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ చిత్రంలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ శక్తివంతంగా సాగుతుంది. లక్ష్యసాధన కోసం పహిల్వాన్ పోరాటమేమిటన్నది స్ఫూర్తివంతంగా ఉంటుంది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి, ఆకాంక్షసింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే చిరంజీవి విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కరుణాకర్, స్క్రీన్‌ప్లే: కృష్ణ, మధు, కన్నన్, సంభాషణలు: హనుమాన్‌చౌదరి, రచన-దర్శకత్వం: ఎస్.కృష్ణ.