రాజకీయల్లోకి కన్నడ సూపర్ స్టార్

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటకలో ఎండలు ముదరక ముందే అసెంబ్లీ ఎన్నికల ప్రభావానికి వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో బిజీబీజీగా ఉన్నారు. ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరో వైపు కాంగ్రెస్ రథసారథి రాహుల్గాంధీ ఆ రాష్ట్రంలో మరింత వేడిని పెంచేస్తున్నారు. ఇక నాణానికి రెండో వైపు ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు సైతం ఎన్నికల సమరం లో విజయం సాధించేందుకు సామ, దాన, భేద, దండోపాయాలని వాడుతున్నాయి.

అలాగే రాజకీయాలకి సిని గ్లామర్ కొత్తేమీ కాదు, ఆనాటి నుండి నేటి వరకు సినిమాల్లో బిజీగా ఉంటూనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ప్రత్యక్ష్యంగా రాకపోయినా ప్రచారానికి వచ్చే వారూ ఉన్నారు. ఇప్పుడు కన్నడ ప్రాంతీయ పార్టీలు సినీ ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నాయి. దీనికి పర్యావసానంగా కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సుదీప్ కూడా జేడీఎస్ రాష్ట్ర అధ్యకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమార స్వామితో సమావేశం అవడం ఈ వార్తలకి ఊతమిచ్చింది.

గతంలోనే మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవగౌడ సుదీప్ ని తమ పార్టీలోకి ఆహ్వానింఆచారు. అయితే ఆ సమయంలో సుదీప్ రాజకీయాల మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ కుమారస్వామితో భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పొలిటికల్ ఎంట్రీ వార్తలను సుదీప్ తోసిపుచ్చాడు. తాను మర్యాదపూర్వకంగానే కుమారస్వామితో భేటీ అయ్యానని సుదీప్ చెప్తుండగా… దాదాపు రెండు గంటల పాటు ఆయన రాజకీయాలు చర్చించారని జేడీఎస్ నేత ఒకరు వెల్లడించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సారి కన్నడ నాట ఎన్నికలు సినీ గ్లామర్ తో నిండిపోనున్నాయి. ఇప్పటికే కన్నడ హీరో ఎన్నికలలోకి దిగనున్నారు. ఉపేంద్ర కాక కన్నడ కామెడీ నటి ఉషా శ్రీ, నటుడు యోగేశ్వర్, అంబరీష్, జగ్గేష్, రమ్య, నిర్మాత మునిరత్న, దండుపాల్యం పూజా గాంధీ, మాజీ హెరాయిన్ రక్షిత వంటి వారు ఈసారి పార్టీలకి స్టార్ క్యంపేయినర్ లుగా వ్యవహరించనున్నారు.