రాహుల్ తప్ప ఇంకెవరూ దొరకలేదా ఏప్రిల్ ఫూల్ చేయడానికి…

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏప్రిల్ 1న మన స్నేహితులనో, మన దగ్గరివారినో పిచ్చోళ్లను చేయడం పరిపాటి.

ఎందుకంటే ఏప్రిల్ 1 ని ప్రపంచ వ్యాప్తంగా ఫూల్స్ డేగా జరుపుకుంటారని తెలిసిందే కదా. కాని ఫూల్ల్స్ డే సందర్భంగా ప్రముఖ రచయిత చేతన్ భగత్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చానీయ అంశం గా మారింది. నిన్న ఉదయం ఆయన ఏం ట్వీటారంటే..”ఇక నేను ఆగలేను. ఈ దేశానికి ఏదైనా చేయాలి. అందుకే కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నాను.

కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసి కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తాను. రాహుల్ గాంధీతో కలిసి బెటర్ ఇండియాను తయారు చేద్దాం. దీనికోసం నాకు మీ ఆశిస్సులు కావాలి. మిగితా వివరాలకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి..” అంటూ చేతన్ ట్వీట్ చేశాడు.
ప్రముఖ రచయిత కాబట్టి, ట్విట్టర్ లో ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి దానిపై క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆ లింక్ ఏంటబ్బా అని నెటిజన్లు ఆతృతగా క్లిక్ చేసి చూసి ఏప్రిల్ ఫూల్స్ అయ్యారు.

ఈ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరలవడంతో పాటు నెటిజన్లు వినూత్నమైన ఏప్రిల్ ఫూల్ ట్వీట్ చేసిన చేతన్ భగత్ ను తెగ ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం నీకు ఫూల్ ని చేయడానికి మా రాహుల్ తప్ప ఇంకెవరూ దొరకలేదా అని మండిపడుతున్నారు.