ర‌ణ‌రంగం చిత్రం వాయిదా ప‌డ‌నుందా ?

ranarangam to get postponed

టాలెంటెడ్ యాక్ట‌ర్ శ‌ర్వానంద్.. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ‌రంగం అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కాజ‌ల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బేన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌నిపించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. శ‌ర్వా చేయ‌బోవు రెండు పాత్ర‌ల‌లో ఒక‌టి యంగ్ ఏజ్ వ్య‌క్తి కాగా, మ‌రొక‌టి ముస‌లి వ్య‌క్తి అని అంటున్నారు. అయితే ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆగ‌స్ట్‌లో రిలీజ్ అవుతుంద‌ని అన్నారు. కాని తాజా స‌మాచ‌రం ప్ర‌కారం సెప్టెంబ‌ర్ రెండో వారంలో ర‌ణరంగం చిత్రాన్ని థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ .. మాఫియాగా మారే నేప‌థ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌టన రానుంది. శ‌ర్వానంద్ ఇటీవ‌ల షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకున్న తాను 96 త‌మిళ రీమేక్‌లో న‌టిస్తున్నారు.