మెగా ఫ్యాన్స్‌కు ‘సైరా’ బ్యాడ్‌ న్యూస్‌

Bad News For Mega Fans In Mega star 151 Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ రీ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్‌ దాదాపు 10 సంవత్సరాలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ స్థాయిలో అంచనాలున్న ఆ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. చిరు రీ ఎంట్రీతో బాక్స్‌లు బద్దలు కొట్టిన నేపథ్యంలో ఆయన 151వ సినిమా కోసం గత ఆరు నెలలుగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు చిరు 151వ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో ప్రారంభించి, సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్‌లో విడుదల చేయాలని భావించారు. కొన్ని కారణాల వల్ల సినిమాను ఈనెలలో రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లలేక పోయారు. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఇంకా చివరి దశ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో జిబీగా ఉన్నాడు. తమిళనాడులోని పొల్లాచ్చిలో ఒక భారీ సెట్టింగ్‌ను వేయిస్తున్నాడు.

ఆ సెట్టింగ్‌ నిర్మాణం పూర్తి అయితే కాని సినిమా చిత్రీకరణ ప్రారంభం కాదని, కొన్ని కారణాల వల్ల ఆ సెట్టింగ్‌ నిర్మాణం ఆలస్యం అవుతుందని అంటున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను అక్టోబర్‌ రెండవ లేదా మూడవ వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు తీసుకు వెళ్లబోతున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబులు ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. ఈ చిత్రంలో మరో స్టార్‌ హీరోయిన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతుందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

సీడెడ్‌లో పవర్‌ చూపుతున్న బాలయ్య

దీక్షకు లక్కీ ఛాన్స్‌