సీడెడ్‌లో పవర్‌ చూపుతున్న బాలయ్య

Record Collections For Balayya Paisa Vasool In Ceded Area

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు సినిమాకు ఎక్కువ మార్కెట్‌ ఉన్నది నైజాం ఏరియాలో అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నైజాం ఏరియాపై సినీ వర్గాల వారు ఎక్కువ దృష్టి పెడతారు. అయితే బాలయ్య సినిమా మాత్రం ఎప్పుడైనా నైజాంతో పాటు సీడెడ్‌లో కూడా పోటా పోటీగా కలెక్షన్స్‌ను సాధిస్తుంది. సీడెడ్‌లో బాలయ్యకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆ విషయం మరోసారి వెళ్లడైంది. బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ సినిమా సీడెడ్‌ కలెక్షన్స్‌ దుమ్ము రేపుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో సీడెడ్‌లో ఏకంగా 3.1 కోట్ల షేర్‌ను ఈ సినిమా సాధించింది. సీడెడ్‌లో బాలయ్య తన ప్రతి సినిమాతో గౌరవప్రధమైన కలెక్షన్స్‌ను రాబడుతూనే ఉన్నాడు. తాజాగా ఈ సినిమాతో కూడా బాలయ్య సీడెడ్‌ డిస్టిబ్యూటర్‌కు లాభాలు తెచ్చి పెట్టాడు.సీడెడ్‌లో 3.1 కోట్ల షేర్‌ను దక్కించుకున్న ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.15 కోట్లు వసూళ్లు అయ్యాయి.

సీడెడ్‌ కంటే రెట్టింపు అయిన నైజాం ఏరియాలో అంత ఎక్కువగా కలెక్షన్స్‌ వసూళ్లు కాకపోవడం ఇక్కడ గమనించవచ్చు. బాలయ్య, పూరిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తీసుకు రావడం ఇప్పటికే ఖరారు అయ్యింది. ఈ వారం విడుదల కాబోతున్న రెండు సినిమాలు సక్సెస్‌ అయితే బాలయ్య కాస్త తగ్గే అవకాశం ఉంది. ఒక వేళ ఈ వారంలో రాబోతున్న చైతూ, అల్లరి నరేష్‌లు ప్రేక్షకులను ఆకట్టుకోకుంటే ఖచ్చితంగా బాలయ్య కెరీర్‌లో టాప్‌ చిత్రాల్లో ఒకటిగా ఇది మిగిలేలా కలెక్షన్స్‌ను సాధిస్తుందనే నమ్మకంను ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు:

బాలీవుడ్ అర్జున్ రెడ్డి ర‌న‌వీర్ సింగ్‌?

పవన్‌25 టైటిల్‌ ఎప్పుడంటే..