గుడ్ న్యూస్ : కార్తికేయ “భజే వాయు వేగం”టీజర్ అవుట్ ..!

Good News: Karthikeya's
Good News: Karthikeya's "Bhaje Vayu Vela" Teaser Out ..!

హీరో గాను అలాగే విలన్ గాను కూడా మెప్పించిన అతి కొద్ది యంగ్ అండ్ టాలెంటెడ్ నటులలో కార్తికేయ కూడా ఒకడు. మరి తాను హీరోగా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చండ్రపు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ నే “భజే వాయు వేగం”. మరి ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ను అయితే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా రిలీజ్ చేయించారు.

అయితే ఈ టీజర్ మాత్రం మంచి రేసీగా ఒక పక్క సాలిడ్ యాక్షన్ తో పాటుగా మంచి ఎమోషన్స్ తో కూడా నిండి ఉన్నట్టు అనిపిస్తుంది . తన తండ్రి కోసం ఎంత దూరమైనా వెళ్లే యుకుడిగా కార్తికేయ కనిపిస్తున్నారు . సాలిడ్ లుక్స్ తో యాక్షన్ పార్ట్ లో తాను అదరగొట్టాడు అలాగే తనికెళ్ళ భరణి పై ఎమోషనల్ ఎపిసోడ్ కూడా వర్క్ అయ్యేలా ఉన్నది .

Good News: Karthikeya's "Bhaje Vayu Vela" Teaser Out ..!
Good News: Karthikeya’s “Bhaje Vayu Vela” Teaser Out ..!

ఇక ఈ టీజర్ లో రాహుల్ టైసన్ కూడా కనిపిస్తున్నారు . రధన్ స్కోర్ మాత్రం యాక్షన్ సీన్స్ వరకు టీజర్ లో చాలా యావరేజ్ గా ఉన్నది . ఆల్రెడీ విన్నట్టుగానే సలార్ స్కోర్ లైన్ కూడా గుర్తు రావచ్చు. ఇది ఫుల్ సినిమా లో కరెక్ట్ చేసుకుంటే బెటర్. అలాగే ఆర్ డి రాజశేఖర్ విజువల్స్ కూడా బాగున్నాయి. అలాగే యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణ విలువలు కూడా ఈ టీజర్ లో బాగా కనిపిస్తూ ఉన్నాయి .

టీజర్ ని మీరు కూడా చూడాలంటే వీడియో పైన క్లిక్ చేయండి