టిల్లు స్క్వేర్ ట్రైలర్: రిలీజ్ డేట్ వచ్చేసింది ..!

Tillu Square Trailer: Release Date Has Arrived ..!
Tillu Square Trailer: Release Date Has Arrived ..!

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ (Tillu square). 2022 లో థియేటర్ల లో రిలీజ్ అయిన డీజే టిల్లు (DJ Tillu) మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది ఈ మూవీ . సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నాగ వంశీ, సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ లో బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించడం జరిగింది. మొదటి పార్ట్ లో నటించిన నేహా శెట్టి గెస్ట్ రోల్ లో కనిపించనుంది.

Tillu Square Trailer: Release Date Has Arrived ..!

Tillu Square Trailer: Release Date Has Arrived ..!

మార్చి 29, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ పై అందరిలో ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ కు దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేయడం జరిగింది. రిలీజైన ప్రచార మూవీ ల కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. రేపు ఈ మూవీ కి సంబందించిన రిలీజ్ ట్రైలర్ విడుదల
కానున్నది . ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. సిద్ధు మరియు అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ చేసుకుంటున్న పోస్టర్ అది. ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది.