బర్త్ డే కానుకగా మాస్ ర్యాంపేజ్ ట్రీట్ ఇస్తున్న రవితేజ

Ravi Teja is giving a Mass Rampage treat as a birthday gift
Ravi Teja is giving a Mass Rampage treat as a birthday gift

మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలని క్రియేట్ చేసింది. ఈ మూవీ ను దర్శకుడు భాను భోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా గా తెరకెక్కి్స్తున్నారు. ఇక ఈ మూవీ లో రవితేజ తన పాత్రతో అభిమానులకి మాస్ జాతర తీసుకురావడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Ravi Teja is giving a Mass Rampage treat as a birthday gift
Ravi Teja is giving a Mass Rampage treat as a birthday gift

అయితే, ఈ మూవీ నుంచి రవితేజ తన పుట్టినరోజు అయిన జనవరి 26న ఒక సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. జనవరి 26న ‘మాస్ జాతర’ మూవీ కి సంబంధించి మాస్ ర్యాంపేజ్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ట్రీట్ అభిమానులకి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉండబోతుందని ఒక కొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ మూవీ లో రవితేజ లుక్ కూడా స్టైలిష్‌గా ఉండనుండటంతో ఈ సినిమా పై అంచనాలను పెరుగుతున్నాయి.

ఇక ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నారు . ఇక ఈ మూవీ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.