విజయ్, గౌతమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్ ..!

Latest news on Vijay and Gautham project ..!
Latest news on Vijay and Gautham project ..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన రీసెంట్ మూవీ “ది ఫ్యామిలీ స్టార్” (The Family Star) తో ఆడియెన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేదు ఇక దీనితో విజయ్ అభిమానులు అంతా తన నెక్స్ట్ మూవీ లు కోసమే ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ మూవీ ల్లో విజయ్ కెరీర్ 12వ మూవీ టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ప్లాన్ చేసిన భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి ఈ మూవీ రీసెంట్ గానే షూట్ స్టార్ట్ కాగా గౌతమ్ ఈ మూవీ కి చేస్తున్న ప్లానింగ్ లు ఫ్యాన్స్ కి ఆశ్చర్యానికి లోను చేసాయి. మరి లేటెస్ట్ గా అయితే మూవీ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ను స్టార్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్టుగా సమాచారం. మొత్తానికి అయితే ఈ మూవీ విషయంలో రౌడీ బాయ్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.