TG Politics: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు వార్నింగ్..?

TG Politics: Warning to Telangana State Congress leaders..?
TG Politics: Warning to Telangana State Congress leaders..?

సీఎం రేవంత్‌ కు రాహుల్‌ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. కేసీ వేణుగోపాల్ మీటింగ్ తర్వాతే.. రుణమాఫీపై మరో తేదీ ప్రకటన చేశారు సీఎం రేవంత్‌. గ్రౌండ్ రియాలిటీని తెలంగాణ రాష్ట్ర పెద్దల ముందు పెట్టారట ఢిల్లీ దూతలు. రేవంత్‌ ప్రభుత్వంపై రైతుల స్పందనను కుండబద్దలు కొట్టారట కేసీ వేణుగోపాల్‌. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు చురకలు అంటించారని సమాచారం.

100 రోజుల పాలనపై తెలంగాణ రాష్ట్ర నేతల ముందు ఢిల్లీ పెద్దల రిపోర్ట్ పెట్టారట. ఈ తరుణంలోనే.. అధిష్టానం సూచన మేరకే రుణమాఫీపై అత్యవసర ప్రకటన చేశారు సీఎం రేవంత్‌. ఇప్పటికే మూడు తేదీలు ప్రకటించిన సీఎం రేవంత్‌. 100 రోజుల్లో ఇస్తామని మేము చెప్పలేదంటున్నారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం ఆగస్టుకు వాయిదా వేయడంపైనా నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చేయిదాటుతున్నందన రాహుల్ సూచన మేరకు హుటాహుటిన కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులుగా ఒక స్టార్ హోటల్‌లో ప్రభుత్వ పెద్దలకు హితబోధ చేసి, రుణమాఫీ ప్రకటన చేయించినట్టు సమాచారం అందుతోంది.