రేవంత్ ఇలాకా “కట్లపాములు”…ఎన్నిక వాయిదా…?

Incometax Rides In Kodangal Constiuency

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెసు అభ్యర్థి రేవంత్ రెడ్డి.. తనను ఓడించడానికి రూ. 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. అందులో నిజం ఎంత ఉందో కానీ కోస్గీలోని తమ బంధువు, విద్యాశాఖలో జాయింట్ కమిషనర్ రేంజ్ లో పని చేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి ఫాంహౌస్ ను కేంద్రంగా చేసుకుని నరేందర్ రెడ్డి అండ్ కో డబ్బులు వెదజల్లడం మొదలు పెట్టారని ఫిర్యాదు అందిన నేపధ్యంలో మంగళవారం అర్థరాత్రి నరేందర్ రెడ్డి స్టే చేస్తోన్న ఫౌంహౌస్ పై కేంద్ర ఆధీనంలోని ఐటీ సంస్థ రైడ్స్ చేసింది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు పక్కా సమాచారంతో విరుచుకుపడ్డారు. సుమారు 15 కోట్ల రూపాయలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని అలాగే మరో ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసిన లెక్కల వివరాలు స్వాధీనం చేసుకుని ఫాం హౌస్ సీజ్ చేశారని తెలుస్తోంది. అయితే స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని రాజీ చేసే ప్రయత్నం చేసినా ఐటీ అధికారులు వినలేదని ఇంత జరిగినా విషయం మాత్రం బయటకు పొక్క లేదు. పొక్కలేదు అనే కంటే పొక్కకుండా తీవ్రమైన జాగ్రత్తలు తీసుకున్నారు అంటే సవ్యంగా ఉంటుందేమో. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. సాయంత్రానికి మొత్తం బయటకు వచ్చింది.

it-rides

ఐతే ఎంత మొత్తం స్వాధీనం చేసుకున్న విషయం ఎన్నికల అధికారి రజత్ కుమార్ బయట పెట్టలేదు. ఈరోజు అన్ని విషయాలు… చెబుతామంటున్నారు. ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి మంత్రి మహేందర్‌ రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డిని బరిలోకి దించడమే కాదు ఆయన గెలుపు బాధ్యతను హరీశ్‌, జితేందర్‌కు కేసీఆర్ అప్పగించారు. రేవంత్ రెడ్డి ని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ కి రానివ్వకుండా చూడాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. రేవంత్ కాంగ్రెసు పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేస్తారని ఉప ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతో అప్పుడే పట్నం నరేంద్ర రెడ్డి ని అభ్యర్థి గా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రేవంత్ అనుచరులు అనేక మందిని టీఆర్ఎస్ లో చేర్చుకొన్నారు. ఐనా రేవంత్ తన బలాన్ని ఎప్పటికీ అప్పుడు ప్రదర్శిస్తూ వస్తున్నారు. కానీ ప్రతి విషయాన్ని వెంటనే మీడియా కు చెప్పే ఎన్నికల సంఘం కొడంగల్ లో ఎంత మొత్తం దొరికింది అన్న దాన్ని రహాస్యంగా ఉంచింది. భారీగా నగదు దొరికితే ఎన్నిక వాయిదా పడే అవకాశం కూడా ఉంది. గతం లో తమిళనాడు లో ఆర్కె నగర్ ఉప ఎన్నిక ను అలాగే వాయిదా వేశారు. దీంతో కోడంగల్ ఉప ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

KCR-Fears-About-MPS-Party-J