విలేజ్ సింగర్ బేబీ మొదటి సినిమా పాట – సంచనలనం అవ్వడం ఖాయం

Palle Koyila Baby Original Song Teaser

టాలెంట్ ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా గుర్తింపు వచ్చితీరుతుంది. ఈ నానుడి విలేజ్ సింగర్ గా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ‘బేబీ’ విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమయ్యింది. అక్షరం ముక్క కూడా రాయడం గానీ, చదవడం గానీ రాని ఈ బేబమ్మ తన మధుర స్వరంతో పాట పాడుతుంటే, విన్నవారెవరో రికార్డు చేసి, యూట్యూబ్ లో పెట్టారు. ఆ వీడియో ఆ చోట, ఈ చోట తిరిగి యూట్యూబ్ సంచలనం అయ్యి, తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన సింగర్స్ మొదలుకొని సినీతారల వరకు ఇంటికి పిలిచి మరి అభినందించారు. అలా అభినందించిన వారిలో సింగర్ ఎస్. జానకి గారు, ఏ. ఆర్. రెహ్మాన్, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఉండడంతో బేబమ్మ గుర్తింపు ఎల్లలు దాటింది. చాలా మంది సంగీత దర్శకులు తనకి పాట పాడే అవకాశం ఇస్తామని మాటిచ్చిన, బేబమ్మ ని సినీగాయకురాలుగా పరిచయం చేసే అవకాశం సంగీత దర్శకుడు రఘు కుంచె తీసుకున్నాడు.

Baby-Original-Song-Teaser

రఘు కుంచె సంగీతం అందిస్తున్న తెలుగు చిత్రం “పలాస 1978” తో బేబమ్మ ని గాయని గా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో బేబమ్మ “పల్లె కోయిల” అనే పాట పాడింది. ఆ పాట కి సంబంధించిన టీజర్ ని రఘు కుంచె విడుదల చేశాడు. తనని కార్ లో స్టూడియో కి తీసుకెళ్లడం మొదలుకొని, రికార్డింగ్ స్టూడియోలో బేబమ్మ పాడుతున్న పాట శృతి సరిచేశాక, బేబమ్మ పాడిన పాట అందరిని ఆశ్చర్యపరచడం ఖాయం. ఈ పాట ఎలా మొదలయ్యిందో రఘు కుంచె తన మాటల్లో “Oct 29 న ఫేస్బుక్ లో వడిశలేరు బేబీ గారి వీడియో చూసినపుడు , ఈమెను ఎలాగైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యాలనే ఆలోచన కలగ్గానే ,ఆవిడని కాంటాక్ట్ చేసి రికార్డింగ్ కి రెడీ అవ్వమని చెప్పి , కొత్త మూవీ పలాస 1978 నిర్మాతను మరియు దర్శకుడిని ఒప్పించి ,ఆఘ మేఘాల మీద లిరిసిస్ట్ లక్ష్మి భూపాల తో పాట రాయించాను, ట్రాక్ రెడీ అవుతుండగానే.. వెంటనే ఇంకో ఆలోచన తట్టింది ..అసలు ఆమె జీవితానికి సంబందించిన ఒక పాట చేస్తే ఎలా ఉంటుంది ..? చాలా మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కదా అని అనిపించి, భూపాల్ కి చెప్పగానే , ట్యూన్ పంపు అన్నాడు .. సరిగ్గా అరగంటలో పంపాడు .. కళ్ళమ్మట నీళ్లు వొచ్చాయి ఆ లిరిక్స్ చూడగానే …థాంక్యూ లక్ష్మి భూపాల….ఆ పాటని త్వరలోనే మీ ముందుకు తెస్తున్నాను … ఈ లోపు ఆ ప్రయాణానికి సంబందించిన చిన్న ఇంట్రెస్టింగ్ క్లిప్…ఎంజాయ్” అని రఘు కుంచె చెప్పుకొచ్చాడు.