కవచం ట్రైలర్: బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి సిన్సియర్ పోలీస్

Bellamkonda Sreenivas and Kajal Aggarwal

నిర్మాతల తనయుల్లో హీరోగా నిలదొక్కుకున్నది ఈతరంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్కడే. రానా దగ్గుబాటి ని నిర్మాత కొడుకు మరియు మనవడిగా అనుకుందామన్న తనకి వెంకటేష్ అనే హీరో తో సంబంధం ఉందాయే. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు పెట్టినదానికి ఎంత రాబడిని తెస్తున్నాయో తెలవని విషయం గాని, తనకి మాత్రం వరుసపెట్టి సినిమాల మీద సినిమాలు వస్తున్నాయి. అవి కూడా పెద్ద దర్శకులతో, క్రేజీ హీరోయిన్లతో. బెల్లంకొండ శ్రీనివాస్ కి తను నటించిన జయ జానకి నాయక మంచి పేరునే తెచ్చిపెట్టింది.

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘కవచం’ సినిమా టీజర్ విదుదలయ్యింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ ఇతనికి జోడిగా నటిస్తుండగా, మెహ్రీన్ మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకి నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తుండగా, నవీన్ చౌదరి శొంఠినేని నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకి సంగీతం థమన్ అందిస్తున్నాడు. టీజర్ గురించి మాట్లాడుకుంటే, సింగర్ హేమచంద్ర వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభం అవుతుంది. ఆ వాయిస్ వింటే ఎందుకో మరి బిచ్చగాడు సినిమాలో విజయ్ ఆంటోనీ వాయిస్ గుర్తొస్తుంది (విజయ్ ఆంటోనీ కి డబ్బింగ్ చెప్తుంది హేమచంద్ర నే కదా). ఆ తరువాత మరీ రొటీన్ డైలాగులతో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రడక్షన్, ఏదో కేసు గురించి పోలీస్ అధికారులు తమలో తాము మాట్లాడుకోవడం, ఈ తతంగం అంత ఏదో రొటీన్ పోలీస్ డ్రామా చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది తప్ప కొత్తగా ఆసక్తి కలిగించడం లేదు. మొత్తానికి కవచం టీజర్ పాత చింతకాయ పచ్చడి లాగే అనిపిస్తుంది. మీరు కూడా ఒక లుక్కేయండి.