మారిన పూరి చేస్తున్న ‘మహబూబా’పై ఆసక్తి

puri-jagannadh-next-film-mehbooba-with-s-son-akash

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ వరుస సినిమాల పరంపర కొనసాగుతూనే ఉంది. పూరి గత చిత్రం ‘పైసా వసూల్‌’ విడుదలై నెల రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే మరో సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. పూరి స్పీడ్‌ ఇంతే. ఈతరం దర్శకుల్లో అత్యధిక సినిమాలు తెరకెక్కించగల సత్తా ఒక్క పూరికి మాత్రమే ఉందని స్వయంగా రాజమౌళి కూడా ఒప్పుకున్నాడు. పూరి ఇంత త్వరగా సినిమాలను ఎలా తీస్తాడో నాకు అర్థం కాదని, ఆయన నుండి సినిమాలను స్పీడ్‌గా ఎలా తీయాలో నేర్చుకోవాలని ఉంది అంటూ పలువురు దర్శకులు కూడా పూరిని ఉద్దేశించి అన్నారు. కేవలం నెల రోజుల గ్యాప్‌లోనే స్క్రిప్ట్‌లను ఫైనల్‌ చేయగల సత్తా దర్శకుడు పూరికి ఉంది.

‘పైసా వసూల్‌’ చిత్రం తర్వాత పూరి తన కొడుకు ఆకాష్‌తో సినిమాను తీసేందుకు సిద్ద అవుతున్నాడు. ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని, ఈ సినిమా స్క్రిప్ట్‌ పూర్తి అయిన తర్వాత నేను మారిపోయాను అని నా గురించి నాకు అనిపించింది. ఖచ్చితంగా ఇది నా గత చిత్రాలకు పూర్తి విభిన్నంగా ఉంటుందని, ఇండియా పాకిస్తాన్‌ల మద్య 1971లో జరిగిన యుద్దం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని పూరి అంటున్నాడు. అప్పుడే ఈ సినిమాకు ‘మహబూబా’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశాడు. పాక్‌ అమ్మాయితో ఇండియన్‌ అబ్బాయి ప్రేమ కథతో ఈ సినిమా నడుస్తుందని టైటిల్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.

ఇప్పటి వరకు అల్లరి చిల్లరగా పూరి సినిమాలో హీరో ఉంటాడు. కాని ఈ సినిమాలో మాత్రం అలా కాదని పూరి మాటలను బట్టి అర్థం అవుతుంది. తన కొడుకు కోసం మారిపోయి పూరి తయారు చేసిన ఈ స్క్రిప్ట్‌ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అని ఇప్పటి నుండి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా నటించి, హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించిన ఆకాష్‌ పూరి ఈ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారబోతున్నాడు. పలువురు హీరోలకు లైఫ్‌ ఇచ్చిన పూరి తన కొడుకును హీరోగా నిలిపేందుకు మారి మరీ స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. ఈ చిత్రంలో ఆకాష్‌కు జోడీగా నేహాశెట్టి అనే కొత్త హీరోయిన్‌ నటించబోతుంది. సందీప్‌ చౌత సంగీతాన్ని అందించబోతున్నాడు. పూరి స్వయంగా ఈ సినిమాను తన సొంత బ్యానర్‌ల నిర్మిస్తున్నాడు. పూరి మారి రాసిన కథ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుందాం.