అర్జున్‌రెడ్డి తర్వాత ఫిక్స్‌ అయ్యింది

arjun-reddy-director-sandeep-reddy-next-hero-sharwanand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘అర్జున్‌ రెడ్డి’ వంటి సెన్షెషన్‌ చిత్రాన్ని తెరకెక్కించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు సందీప్‌ వంగ తన తర్వాత సినిమాపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నాడు. పలువురు హీరోలు ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిని కనబర్చుతున్నారు. కాని ఈయన మాత్రం తన వద్ద ఉన్న కథకు శర్వానంద్‌ మాత్రమే సూట్‌ అవుతాడు అని నిర్ణయించుకున్నాడు. ఇటీవలే శర్వానంద్‌తో కథ చర్చలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేసి సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్తాను అంటూ సందీప్‌ వంగ చెబుతున్నాడు.

ఈ దసరాకు శర్వానంద్‌ నటించిన ‘మహానుభావుడు’ చిత్రం విడుదల కాబోతుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ప్రేక్షకులు న్నారు. ఆ సినిమా తర్వాత శర్వానంద్‌ సినిమా సందీప్‌ వంగ దర్శకత్వంలో ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. నవంబర్‌లో వీరి కాంబో మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆది హీరోగా నటించిన ‘చుట్టాలబ్బాయి’ చిత్రాన్ని నిర్మించిన వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. సందీప్‌తో వెంకట్‌కు ఉన్న సన్నిహిత్యమే ఈ కాంబోకు కారణంగా చెబుతున్నారు.