రంగస్థలంపై చిరు, జక్కన్న ఏంటో?

Chiranjeevi Rajamouli sudden entry in Ram Charan Rangasthalam shooting

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985’ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రంను దర్శకుడు సుకుమార్‌ విభిన్నంగా తెరకెక్కిస్తున్నాడు. చరణ్‌ మొదటి సారి ఒక పల్లెటూరు కుర్రాడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈయన లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో ఉన్నట్లుండి దర్శకుడు రాజమౌళి మరియు చిరంజీవిలు ప్రత్యక్షం అయ్యారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా చిరంజీవి మరియు రాజమౌళి ఎంట్రీతో ఆశ్చర్యంను వ్యక్తం చేశారు. దర్శకుడు సుకుమార్‌తో వీరిద్దరు చాలా సమయం ముచ్చటించి షూటింగ్‌ స్టేటస్‌ను కనుకున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవితో ఒక విషయమై కలిసిన రాజమౌళి అదే సమయంలో చరణ్‌ మూవీ షూటింగ్‌ స్పాట్‌కు ఇద్దరు కలిసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల గురించి మీడియాలో పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. జక్కన్న తర్వాత సినిమా చరణ్‌తో ఉండబోతుంది, అందుకే ఇలా మెగా ఫ్యామిలీతో జక్కన్న గత కొన్ని రోజులుగా సన్నిహితంగా ఉంటున్నాడని చెబుతున్నారు. జక్కన్న తర్వాత సినిమా గురించే ‘రంగస్థలం’కు వెళ్లి ఉంటాడు అనే చర్చ కూడా జరుగుతుంది.