నాగార్జున కొత్త లుక్‌కు కారణం ఇదే…

Nagarjuna New look for Nag and Nani Multistarrer Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నేడు ఎయన్నార్‌ జయంతి సందర్బంగా అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘రాజుగారి గది 2’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ఇందుకోసం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్‌మీట్‌లో నాగార్జున విభిన్నంగా కనిపించాడు. మునుపటితో పోల్చితే బక్కగా మరియు క్లీన్‌ సేవ్‌తో, కనీసం మీసాలు కూడా లేకుండా ఉండటంతో అంతా కూడా అవాక్కయ్యారు. నాగార్జున ఏంటి ఇలా షాక్‌ ఇచ్చాడు అంటూ అంతా కూడా నోరెళ్ల బెట్టారు. నాగార్జున ఈ కొత్త లుక్‌ వెనుక కారణం ఉందని కొందరు ఊహిస్తున్నారు.

ఇటీవల నాగార్జున ఒక మల్టీస్టారర్‌ సినిమాకు కమిట్‌ అయ్యాడు. ఆ సినిమాకు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా, నాని మరో హీరోగా నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా కోసం టెస్ట్‌ షూట్‌ను జరుపుతున్నారు. అందుకోసమే ఇలా నాగార్జున కొత్త లుక్‌లో ఉన్నాడు అంటున్నారు. నాగార్జున మాత్రం కొత్త లుక్‌ గురించి ప్రశ్నించిన సమయంలో నవ్వేసి వదిలేశాడు. విభిన్న పాత్రలు చేస్తూ, విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నాగార్జున మరోసారి ఈ సినిమాతో మెప్పించడం ఖాయం అని తెలుస్తోంది. ఇలా నాగార్జునను చూస్తుంటే చైతూ, అఖిల్‌కు ట్విన్‌ బ్రదర్‌ ఉన్నట్లుగా ఉన్నాడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.