‘జై లవకుశ’ ఫస్ట్‌డే టార్గెట్‌ ఎంతో తెలుసా?

Jai Lava Kusa Movie First Day Collection Target 125 Crores

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ‘జై లవకుశ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2500 స్క్రీన్‌లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టే విధంగా మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 80 శాతం థియేటర్లలో జై లవకుశ విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ను తీసుకున్న డిస్టిబ్యూటర్లు స్థానికంగా కూడా భారీ ప్రచారం చేస్తున్నారు.

దసరా సందర్బంగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి రోజు 25 నుండి 27 కోట్లు వసూళ్లు చేయనుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంతో చెబుతున్నారు. ఓవర్సీస్‌తో పాటు, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ మొత్తాన్ని మొదటి రోజే వసూళ్లు చేయనుందని, మొదటి నాలుగు రోజుల్లో 125 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం లాంగ్‌ రన్‌లో 125 కోట్ల షేర్‌ను సాధించడం ఖాయం అంటూ ట్రేడ్‌ వర్గాల వారు సైతం నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 120 కోట్లు చేసింది. అందుకే భారీ వసూళ్లు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌ అవుతారు. తెలంగాణలో సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో కలెక్షన్స్‌ భారీగా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు ఆశిస్తున్నారు. రాశిఖన్నా, నివేదా థామస్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించారు.