చిరంజీవి, రాజ‌మౌళి క‌లిసి చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర‌కు..

Chiranjeevi And SS Rajamouli From The Sets Of Ram Charan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబ‌లి 2 రిలీజ‌యిన ద‌గ్గర నుంచి ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనేదానిపై అనేక ఊహాగానాలు చెల‌రేగాయి. మ‌గ‌ధీర త‌ర్వాత మెగా కుటుంబంతో రాజ‌మౌళికి విభేదాలు వ‌చ్చాయ‌ని వార్త‌లొచ్చాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా రాజ‌మౌళి ఎప్పుడూ మెగా కుటుంబం గురించి త‌న మాట‌ల్లో ప్ర‌స్తావించేవాడు కాదు. కానీ బాహుబ‌లి 2 త‌ర్వాత మాత్రం రాజ‌మౌళి ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించాడు. చిరంజీవి కుటుంబంతో త‌న‌కు ఎలాంటి విభేదాలు లేవ‌ని స్ప‌ష్టంచేశాడు. అటు రామ్ చ‌ర‌ణ్ తేజ కూడా ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చాడు. గ‌త ఐదారేళ్ల‌లో ఎప్పుడూ లేనిది వారిద్ద‌రూ ఇలా ఒక‌రిగురించి మ‌రొక‌రు మాట్లాడ‌డంతో రాజ‌మౌళి త‌దుప‌రి సినిమా చ‌రణ్ తోనే అంటూ వార్త‌లొచ్చాయి. వాటికి ఊత‌మిస్తూ ఇటీవ‌ల చిరంజీవి, రాజ‌మౌళి ఒకే వేదికపై క‌లిసి క‌నిపించారు. ఇప్పుడు తాజాగా చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సెట్స్ కి చిరంజీవి, రాజ‌మౌళి క‌లిసి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. సుకుమార్, చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న రంగ‌స్థ‌లం కోసం హైద‌రాబాద్ లో ప‌ల్లెటూరి సెట్ వేసి షూటింగ్ జ‌రుపుతున్నారు. సినిమాలో ప్ర‌ధాన‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా…హ‌ఠాత్తుగా చిరంజీవి రాజ‌మౌళితో క‌లిసి అక్క‌డ క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. యూనిట్ స‌భ్యులంద‌ర‌నీ చిరంజీవి, రాజ‌మౌళి న‌వ్వుతూ ప‌ల‌క‌రించారు. సినిమా షూటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజ‌మౌళి మెగా క్యాంప్ కు చేరువ‌య్యాడ‌ని, ఆయ‌న త‌దుప‌రి సినిమా చ‌ర‌ణ్ తోనే అని జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఈ సంఘ‌ట‌న మ‌రింత బ‌లాన్నిచేకూర్చుతోంది.