‘రాజుగారి గది 2’ ట్రైలర్‌ రివ్యూ

Raju Gari Gadhi 2 Theatrical Trailer review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బుల్లి తెరపై యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఓంకార్‌ ‘జీనియస్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకున్నా కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ తర్వాత ‘రాజుగారి గది’ చిత్రాన్ని తెరకెక్కించి భారీ లాభాలను ఓంకార్‌ దక్కించుకున్నాడు. ఆ సినిమా హర్రర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కి సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా తర్వాత ఓంకార్‌కు ‘రాజుగది గది 2’ చిత్రాన్ని నాగార్జునతో చేసే అవకాశం దక్కింది. రాజుగారి గదికి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. టైటిల్‌ బాగుందని కంటిన్యూ చేశారు. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు సమంత కూడా నటించింది.

ప్రేక్షకులు ఆశించినట్లుగానే కామెడీతో పాటు హర్రర్‌ కూడా ఈ చిత్రంలో ఓ రేంజ్‌లో ఉండబోతుందని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా ఓంకార్‌ స్థాయిని పెంచబోతుందనిపిస్తుంది. నాగార్జున దెయ్యాలను పట్టే వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇక సమంత ఒక దెయ్యం పాత్రలో కనిపించనుందని ముందే తేలిపోయింది. పగతో రగిలిపోయే దెయ్యం పాత్రలో సమంత నటించింది. ఆ దెయ్యం పగ తీర్చే వ్యక్తిగా నాగార్జున కనిపిస్తాడని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, ప్రవీణ్‌ల కామెడీ దద్దరిల్లబోతున్నట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే తేలిపోయింది. ఇచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.