లాభాల్లో నా సామిరంగ..2024 లో నాగార్జున మొదటి హిట్

లాభాల్లో నా సామిరంగ..2024 లో నాగార్జున మొదటి హిట్
Cinema News

టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ. ఈ మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని సాధించింది. ఈ ఏడాది హనుమాన్ తర్వాత, సూపర్ హిట్ గా నిలిచిన మూవీ గా నా సామిరంగ నిలిచింది.

లాభాల్లో నా సామిరంగ..2024 లో నాగార్జున మొదటి హిట్
Naa Saami Ranga

ఈ మూవీ లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, అషికా రంగనాథ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.