జాన్వీ కపూర్ పాత్రపై కొత్త వార్త..!

జాన్వీ కపూర్ పాత్రపై కొత్త వార్త..!జాన్వీ కపూర్ పాత్రపై కొత్త వార్త..!
Cinema News
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ మూవీ  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అయితే, తాజాగా ఆమె పాత్ర పై ఒక  పుకారు ప్రస్తుతం షికారు చేస్తోంది. దేవర కథలో జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు అని, కేవలం పాటల్లో మాత్రమే ఆమె పాత్ర హైలైట్ అవుతుంది అని, అంతకు మించి జాన్వీ కపూర్ పాత్రలో ఎలాంటి డెప్త్ లేదు అని వార్తలు బాగా  వినిపిస్తున్నాయి. కాకపోతే, దేవర టీమ్ మాత్రం జాన్వీ కపూర్ పాత్ర కూడా కథలో కీలకం అని చెబుతుంది.
జాన్వీ కపూర్ పాత్రపై కొత్త వార్త..!జాన్వీ కపూర్ పాత్రపై కొత్త వార్త..!
Devara Movie
కాగా దేవర కథ సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం అందరికి  తెలిసిందే. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందట. మరోవైపు ఈ మూవీ  కోసం లెంగ్తీ షెడ్యూళ్లు ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. కాబట్టి.. ఈ మూవీ షూట్ వేగంగా జరుగుతుంది. అన్నట్టు ఈ మూవీలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్‌ ట్రై చేస్తున్నాడు. మొత్తానికి ఈ మూవీ కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ మూవీ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.