‘దేవర’లో అదిరిపోయే ట్విస్ట్..తెలిస్తే పూనకాలే..?

‘దేవర’లో అదిరిపోయే ట్విస్ట్..తెలిస్తే పూనకాలే..?
Cinema News

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్నాడు. అయితే, తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ మూవీ లోని ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఒక సర్ ప్రైజింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందని తెలుస్తోంది. ఈ ట్విస్ట్ మూవీ మొత్తానికే హైలైట్ గా నిలుస్తోందట. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ కూడా పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని టాక్. దేవర మూవీ ను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారంట.

ఎంతైనా కొరటాల ఈ దేవర కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఈ మూవీ వస్తుండే సరికి, ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ మూవీ ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ మూవీ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.