డ్రగ్స్‌ ఇష్యూ : కాజల్‌, లావణ్య, రాశిఖన్నాలు కూడా..!

Police arrested to Kajal manager Roni in Drug case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ ఇష్యూ స్టార్స్‌కు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు డ్రగ్స్‌ను తీసుకునే వారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలోనే కాజల్‌, రాశిఖన్నా, లావణ్య త్రిపాఠిలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోనిని పోలీసులు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంగా ఈయన కెల్విన్‌ నుండి డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లుగా విచారణలో వెళ్లడైంది. దాంతో పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు. ఆ డ్రగ్స్‌ను తానే స్వయంగా వాడేవాడా లేక తాను మేనేజర్‌గా వ్యవహరిస్తున్న హీరోయిన్స్‌ కోసం తీసుకునేవాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రస్తుతం సిట్‌ అధికారుల అదుపులో ఉన్న రోనిని త్వరలోనే విచారించనున్నారు. మరో వైపు రోని నుండి శాంపిల్స్‌ను తీసుకుని డ్రగ్స్‌ అలవాటు ఉందా అనే విషయాన్ని నిర్థారించనున్నారు. ఒక వేళ ఆయనకు డ్రగ్స్‌ అలవాటు లేకుంటే ఆ డ్రగ్స్‌ ఎవరి కోసం తీసుకునేవాడు అనే విషయాన్ని కూడా నిర్థారించనున్నారు. మొత్తానికి డ్రగ్స్‌ కేసులో స్టార్‌ హీరోయిన్స్‌గా టాలీవుడ్‌ను దున్నేస్తున్న కాజల్‌, లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలు కూడా ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. ఒక వేళ సిట్‌ అధికారులు వారిని కూడా విచారించే అవకాశం ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఇంక ఎందరి పేర్లు బయటకు వస్తాయో అని సినీ వర్గాల వారు ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని వార్తలు

కొరటాల జెట్‌ స్పీడ్‌ మీదున్నాడుగా..!

వర్మ కూడా డ్రగ్స్‌ కేసులో..!

ఎన్టీఆర్‌ ‘సమ సమాజ్‌ పార్టీ’..?