నూతన వధూవరులు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల నటి లావణ్య త్రిపాఠి ఇటీవల ఇటలీ లో ఎంతో వైభవంగా వివాహం చేసుకున్న విషయం మనకి తెలిసిందే. శ్రీనువైట్ల తెరకెక్కించిన మిస్టర్ సినిమా ద్వారా చిగురించిన వీరి ప్రేమ, ఆ తరువాత ఇరు కుటుంబాల పెద్దలని ఒప్పించి శుభప్రదమైన వివాహబంధం గా మారిపోయింది . ప్రస్తుతం వీరిద్దరూ తొలి పండుగైన దీపావళి ని వైభంగా జరుపుకున్నారు .
![వరుణ్ తేజ్, లావణ్య దీపావళి కాస్ట్యూమ్స్‌తో సూపర్‌గా కనిపించారు వరుణ్ తేజ్, లావణ్య దీపావళి కాస్ట్యూమ్స్‌తో సూపర్‌గా కనిపించారు](https://i0.wp.com/telugu.telugubullet.com/wp-content/uploads/2023/11/Untitled-design-2023-11-14T105157.853.jpg?resize=696%2C397&ssl=1)
ఈ సందర్భంగా వరుణ్, లావణ్య ఇద్దరూ కూడా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ తో దిగిన స్పెషల్ ఫోటో షూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా వీరిద్దరి దాంపత్యం కలకాలం ప్రేమానురాగాలతో ఎంతో అన్యోన్యంగా కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు .