ఎన్టీఆర్‌ ‘సమ సమాజ్‌ పార్టీ’..?

NTR Sama Samaj Party In Jai Lava Kusa Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలి అనేది నందమూరి ఫ్యాన్స్‌ కోరిక. ఆ మద్య తెలుగు దేశం కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్‌కు అద్బుతమైన రెస్పాన్స్‌ దక్కింది. రాజకీయాల్లో రాణించగల సత్తా ఎన్టీఆర్‌కు ఉందనే విషయం అప్పుడే అర్థం అయ్యింది. అప్పటి నుండి కూడా ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలనే చర్చ జరుగుతుంది. తెలుగు దేశం పార్టీలో నారా లోకేష్‌కు అధిక ప్రాధాన్యం దక్కాలని, తన తర్వాత లోకేష్‌ను అధినేతగా చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీలో ఎన్టీఆర్‌ను ఎదగకుండా దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కూడా ఎన్టీఆర్‌ను ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఆ మద్య ఎన్టీఆర్‌ ఒక పార్టీ పెట్టబోతున్నాడు, పెట్టాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఎన్టీఆర్‌ సమ సమాజ్‌ పార్టీ అంటూ వార్తలు పుట్టుకు వస్తున్నాయి. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్న ఎన్టీఆర్‌ ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కోసం ఎన్టీఆర్‌ ‘సమ సమాజ్‌ పార్టీ’ని ప్రారంభిస్తాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ రాజకీయ నాయకుడిగా సినిమాలో అదరగొడతాడు అనే చర్చ జరుగుతుంది. మూడు విభిన్న పాత్రలు కూడా నందమూరి ఫ్యాన్స్‌ వింధు భోజనం ఖాయం అంటున్నారు. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాను నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు జోడీగా రాశిఖన్నా, నివేదా థామస్‌లు నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు

వారంకే వెనక్కు వచ్చేసిన జ్యోతి

వర్మకు ఎక్సైజ్ చెక్

 ముమైత్‌ ఖాన్‌ వస్తానంది.. ఎలా?