వారంకే వెనక్కు వచ్చేసిన జ్యోతి

Jyothi First Eliminated From Bigg Boss House

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పలు భాషల్లో సూపర్‌ హిట్‌ అయిన ‘బిగ్‌బాస్‌’ తెలుగులో కూడా ప్రేక్షకులను అలరిస్తూ దూసుకు పోతుంది. మొదటి వారం పూర్తి అయ్యింది. మొదటి వారంలో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఇక మొదటి వారంలో ఎలిమినేషన్‌కు అయిదుగురు నామినేషన్‌ అయిన విషయం తెల్సిందే. ఆ అయిదుగురులో జ్యోతి మరియు కత్తి మహేష్‌లలో ఒకరు ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జ్యోతికి ఎలిమినేషన్‌ తప్పలేదు.

హౌస్‌మెంట్స్‌ తిరష్కరణకు గురైన జ్యోతి బిగ్‌బాస్‌ హౌస్‌లో మంచిగా ప్రవర్తించి ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక పోయింది. దాంతో హౌస్‌ నుండి మొదటి వారంలోనే జ్యోతి వెనక్కు రావాల్సి వచ్చింది. జ్యోతి బిగ్‌బాస్‌ కోసం కొడుకును హాస్టల్‌లో జాయిన్‌ చేసింది. తాను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అంటూ హౌస్‌లోకి వెళ్లిన ఆమెకు అక్కడ సరైన పద్దతిలో వ్యవహరించక పోవడంతో పాటు, అన్ని విధాలుగా ఆమె ఫ్లాప్‌ అయ్యింది. దాంతో బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి జ్యోతి ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది. హౌస్‌లో మొదటి నుండి కూడా ఆమె ప్రవర్తనను ప్రేక్షకులు విమర్శిస్తూనే ఉన్నారు. అందుకే ఆమె ఎలిమినేషన్‌ నామినీ అయినప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వలేదు.

వర్మకు ఎక్సైజ్ చెక్

ముమైత్‌ ఖాన్‌ వస్తానంది.. ఎలా?

 మహేష్‌ సినిమానా మజాకా?