ముమైత్‌ ఖాన్‌ వస్తానంది.. ఎలా?

mumaith khan attends to SIT Interrogation

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్‌ కేసులో నిందితురాలుగా ఉన్న ముమైత్‌ ఖాన్‌ను విచారించేందుకు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు చొప్పున విచారణకు హాజరు అవుతున్నారు. పూరి జగన్నాథ్‌, చోటా కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌ ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్నారు. నోటీసులు అందుకున్న అంతా కూడా విచారణకు హాజరు అవుతామని చెప్పారు అంటూ సిట్‌ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ముమైత్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ షోలో ఉంది. అయినా ఆమె కూడా విచారణకు హాజరు అవుతాను అంటూ చెప్పిందట. 

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం ఉన్న ముమైత్‌ ఖాన్‌ ఎలా సిట్‌ అధికారుల ముందు విచారణకు హాజరు అవుతుంది అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో కూడా ముమైత్‌ ఖాన్‌ పేరు లేదు. అయినా ఆమె ఎలా విచారణకు హాజరు అయ్యే అవకాశం ఉంది అనేది చూడాలి. అయితే సిట్‌ అధికారులు స్ట్రాంగ్‌గా ముమైత్‌ ఖాన్‌కు నోటీసుల్లో హాజరు కావాల్సిందిగా చెప్పడం వల్ల ఆమె వీలు కల్పించుకుని బిగ్‌బాస్‌ నుండి ఆమె బయటకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒకవేళ ముమైత్‌ ఖాన్‌ బయటకు వెళ్లి మళ్లీ లోపలకు వెళ్తుందా లేదా బయటే ఉండిపోతుందా అనేది చూడాలి.

మరిన్ని వార్తలు

మహేష్‌ సినిమానా మజాకా?

సినిమా సెలబ్రెటీ ఆవేదనను పోస్ట్‌ చేసిన వర్మ

కొడుక్కి వెరైటీ గా ఎన్టీఆర్ బర్త్ డే విషెస్.