మహేష్‌ సినిమానా మజాకా?

mahesh bharath ane nenu movie Satellite Rates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సినిమా అంటే ఎంత క్రేజ్‌ ఉంటుందో మరోసారి రుజువు అయ్యింది. ప్రస్తుతం మహేష్‌బాబు ‘స్పైడర్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అను నేను’ చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. పెట్టిన బడ్జెట్‌కు దానయ్య లాభాలు పొందే అవకాశం ఉందని సినీ వర్గాలో అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే ప్రిరిలీజ్‌ బిజినెస్‌ ప్రారంభం అయ్యింది. పలు ఏరియాల్లో భారీ మెత్తానికి ఈ సినిమాను తీసుకునేందుకు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. 

మహేష్‌, కొరటాలల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా అదే స్థాయిలో ఉండటం ఖాయం అని అంతా భావిస్తున్నారు. అందుకే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ దాదాపుగా 25 నుండి 30 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం నిర్మాత దానయ్య 30 కోట్లకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడట. ఆలస్యం అయితే సినిమాపై అంచనాలు పెరిగి ఆ రేట్‌ మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ ఈ సినిమాను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అయితే ప్రస్తుతం నిర్మాతతో ఆ ఛానెల్స్‌ బేరసారాలు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్టార్‌ మా లేదా జెమిని టీవీ ఈ సినిమాను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అనేది ఇంకా ఫిక్స్‌ కాలేదు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుంది

మరిన్ని వార్తలు

సినిమా సెలబ్రెటీ ఆవేదనను పోస్ట్‌ చేసిన వర్మ

కొడుక్కి వెరైటీ గా ఎన్టీఆర్ బర్త్ డే విషెస్.

షాక్‌ : రానా షో నెం.1