షాక్‌ : రానా షో నెం.1

no 1 yaari witha rana get top trp rating

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించి మెప్పించిన రానా ప్రస్తుతం జెమిని చానెల్‌లో నెం.1 యారి విత్‌ రానా అనే టాక్‌ షోను చేస్తున్న విషయం తెల్సిందే. మొదటి ఎపిసోడ్‌తోనే ఈ టాక్‌ షో రెగ్యులర్‌ టాక్‌ షో మాదిరిగా ఉందని అంతా పెదవి విరిచారు. దీనికంటే ప్రదీప్‌ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా బాగుందనే విమర్శలు వచ్చాయి. అయితే మెల్ల మెల్లగా రానా తన స్టైల్‌ను మార్చుకుంటూ, మెల్లమెల్లగా షోపై పట్టు పెంచుకుంటూ వచ్చాడు. మంచి మంచి సెలబ్రెటీలను తీసుకు రావడంతో పాటు వారితో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంతో రానా షో ది బెస్ట్‌ టాక్‌ షోగా నిలిచింది. 

ప్రతి వారాంతంలో ప్రసారం అవుతున్న ఈ టాక్‌ షో ప్రస్తుతం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఏపీ మరియు తెలంగాణలో ప్రస్తుతం ఈ షో అత్యధిక రేటింగ్‌ను రాబట్టడటంతో నిర్వాహకులు ఫుల్‌ హ్యాపీ అవుతున్నారు. 9.1 టీవీఆర్‌ రేటింగ్‌ను సాధించిన ఏకైక తెలుగు షోగా నెం.1 యారి నిలిచింది. ఈ షోలో వస్తున్న సెలబ్రెటీలు సరదా ముచ్చటు చెప్పడంతో పాటు, ఆసక్తికర విషయాలను చెబుతుండటంతో ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆధరిస్తున్నారు అనే టాక్‌ వస్తుంది. రానా ఆకట్టుకోగలడా అని భావించిన నిర్వాహకులకు ఏకంగా నెం.1 వచ్చే వరకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ షోతో భారీ పారితోషికాన్ని రాని తన ఖాతాలో వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు

కొడుక్కి వెరైటీ గా ఎన్టీఆర్ బర్త్ డే విషెస్.

టాప్‌ 10లో 2.. నానికి అరుదైన రికార్డ్‌

సిట్‌ను విసిగించిన సుబ్బరాజు

షాక్‌ : రానా షో నెం.1 - Telugu Bullet