పిక్‌టాక్‌ : బిగ్‌బాస్‌లో బుల్లి యంగ్‌టైగర్‌

NTR Son Abhay Ram at JR NTR Birthday Celebrations big boss show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

స్టార్‌ మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షో వారాంతంలో ఎన్టీఆర్‌ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. నేడు ఎన్టీఆర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎన్టీఆర్‌తో పాటు ఆయన కొడుకు అభయ్‌రామ్‌ కూడా బిగ్‌బాస్‌ షోలో సందడి చేయనున్నట్లుగా తెలుస్తోంది. నేడు అభయ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక అతిథిగా అభయ్‌రామ్‌ను తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 

ఈ పొటోను ఎన్టీఆర్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్‌తో నేడు షోపై ఆసక్తి పెరుగుతుంది. అభయ్‌రామ్‌ కోసం అయినా షోను చూడాలని కోట్లాది మంది ప్రేక్షకులు ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అభయ్‌ రామ్‌ను బుల్లి తెరపై చూసింది లేదు. మొదటి సారి బిగ్‌బాస్‌ షోలో కనిపించనుండటంతో అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. నేడు టీఆర్పీ రేటింగ్‌ దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఒక వేళ నేడు రాకుంటే రేపు అంటే ఆదివారం వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

టాప్‌ 10లో 2.. నానికి అరుదైన రికార్డ్‌

సిట్‌ను విసిగించిన సుబ్బరాజు

బిగ్‌బాస్‌ : చీప్‌గా సిగరెట్ల కోసం..!