బిగ్‌బాస్‌ : చీప్‌గా సిగరెట్ల కోసం..!

War For Cigarettes Smoking In Big Boss Show Going Cheap

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]h                                                                                                                                                                                                                           
స్టార్‌ మా లో ప్రసారం అవతున్న బిగ్‌బాస్‌ షో నీరసంగా సాగుతుంది. మొదటి నుండి ప్రేక్షకులు ఊహించుకున్నంత ఆసక్తికరంగా లేదు అని చెప్పక తప్పదు. షో ప్రారంభం నుండి కూడా ప్రేక్షకులు పెదవి విరుస్తూనే ఉన్నారు. నిన్న ప్రసారం అయిన ఎపిసోడ్‌ అంతా సోదిగా ఉంది. స్మోకింగ్‌ రూం రూల్స్‌ను అతిక్రమించారనే ఉద్దేశ్యంతో బిగ్‌బాస్‌ హౌస్‌మెంబర్స్‌కు సిగరెట్లు ఇవ్వకుండా శిక్షను ఇచ్చాడు. దాంతో హౌస్‌మెంబర్స్‌ కాస్త సీరియస్‌ అయ్యారు. ముఖ్యంగా శివబాలాజీ మరీ సీరియస్‌ అయ్యాడు. మేమేం గతి లేక రాలేదు. మేము ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాం, మా కనీస అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మీకు ఉంది. అంటూ శివబాలాజీ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు.

శివబాలాజీతో పాటు సిగరెట్స్‌ తాగే వారు అంతా కూడా బిగ్‌బాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. చివరకు షో నుండి బయటకు వెళ్తాం అంటూ బిగ్‌బాస్‌ను హెచ్చరించారు అంటూ సిగరెట్ల కోసం వారు ఎంతకు దిగజారారో అర్థం చేసుకోవచ్చు. ఏం కొన్ని గంటలు లేదా కొన్ని రోజులు సిగరెట్లు లేకుంటే చనిపోతారా, కోట్లాది మంది చూస్తారని తెలిసి కావాని ఇలా ఓవర్‌ యాక్షన్‌ చేశారా అనేది తెలియదు కాని, సిగరెట్ల కోసం నిన్న బిగ్‌బాస్‌ షోలో జరిగిన రచ్చ అసహ్యంగా అనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో అదే ప్రచారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు:

దిల్‌రాజు రీ షూట్‌ ఫిదా చేసింది

రకుల్‌ కీలక ప్రకటన