కె.ఏ . పాల్ తో ఎన్టీఆర్ కి పనిపడింది.

Star Maa Approach to KA Paul for NTR Big Boss Reality show

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్ బాస్ కార్యక్రమాన్ని తెలుగులో హిట్ చేయడానికి స్టార్ మా టీవీ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తేలిగ్గానే ఈ షో చేయడానికి ఒప్పించిన స్టార్ టీవీ ఇక అందులో పాల్గొనే పార్టిసిపంట్స్ విషయంలో ఇంకా సంచలనాలకు తెర లేపే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే యాంకర్ తెలుగు లోగిళ్ళలో అందరికీ చిరపరిచితమైన సుమ, విలక్షణ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ని ఈ షో కోసం స్టార్ మా టీవీ సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళు ఇంకా స్టార్ ప్రతిపాదనకు ఓకే చెప్పలేదట. వారి కోసం ఎదురు చూస్తూనే ఇంకో సెన్షేషనల్ వ్యక్తిని సీన్ లోకి దించడానికి స్టార్ మా టీవీ ట్రై చేస్తోంది.

కె.ఏ .పాల్… ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయమైందే. మత బోధకుడిగా వున్న పాల్ అప్పట్లో రాజకీయాల్లోనూ ఓ చెయ్యి వేశారు. వై.ఎస్ కి వ్యతిరేకంగా చాలా కామెంట్స్ చేశారు. ఆయన కామెంట్స్ చేసే తీరు చూస్తే కొందరికి కోపమొస్తుంది. ఎక్కువ మందికి నవ్వొస్తుంది. ఈ సృష్టిలో ఏ అద్భుతమైనా చేయగలిగే శక్తి తనకు ఉందంటూ ఆయన ఉదరగొట్టే మాటలు వింటుంటే ఎంతటి సీరియస్ పర్సన్ అయినా నవ్వి తీరాల్సిందే. అవతలి వాళ్ళు జోక్ గా తీసుకుంటున్నా లెక్క చేయకుండా అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల దగ్గర నుంచి ప్రపంచ శాంతి దాకా అన్ని విషయాల్లో తన పాత్ర ఉందని చెప్పేస్తారు. ఇంతటితో ఆగలేదు ఈయన లీలలు. ఒకప్పుడు ప్రజాశాంతి పేరుతో ఓ పార్టీ కూడా పెట్టేసారు. ఆ పార్టీ తరపున అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పి నానాహడావిడీ చేసేసారు. అలాంటి పార్టీ నాయకుడితో ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కోసం పని పడింది. ఆయన్ని ఈ షో లో పాల్గొనేలా చేయడానికి స్టార్ మా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆ ప్రయత్నం సక్సెస్ అయితే బిగ్ బాస్ పెద్ద హిట్ అయినట్టే.

 మరిన్ని వార్తలు 

కాజోల్ కుటుంబం లో టాబు నిప్పులు?

కుల్లుకునేది పవన్‌ ఫ్యాన్సేనా..?

సాయిధరమ్‌ తేజ్‌ చేసిన మరో ‘తిక్క’ సినిమా