కుల్లుకునేది పవన్‌ ఫ్యాన్సేనా..?

Pawan's fans feel jalasi on getting good collections for the DJ movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Pawan’s Fans Feel Jealous  On Getting Good Collections For The  DJ Movi32

అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్‌ను రాబడుతుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రేక్షకుల్లో కూడా కొందరు ఈ సినిమాను బ్యాడ్‌ చేస్తూ మాట్లాడుతున్నారు. దాంతో కలెక్షన్స్‌ ఇంకా ఎక్కువ రావాల్సి ఉన్నా తక్కువగా వస్తున్నాయని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. తాజాగా దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అల్లు అర్జున్‌పై చాలా కాలంగా పవన్‌ ఫ్యాన్స్‌కు ఆగ్రహంగా ఉంది. చెప్పను బ్రదర్‌ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి కూడా బన్నీని పవన్‌ ఫ్యాన్స్‌ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. 

తాజాగా కూడా ‘డీజే’ చిత్రం విషయంలో కొందరు పవన్‌ ఫ్యాన్స్‌ చెడుగా ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు సంబంధించి  నెగటివ్‌ టాక్‌ వచ్చేలా ప్రయత్నాలు చేసినా కూడా మంచి కలెక్షన్స్‌ వస్తుండటంతో పవన్‌ ఫ్యాన్స్‌ మరింతగా రెచ్చి పోతున్నారు. అందుకే తాజాగా తమ సినిమాకు మంచి కలెక్షన్స్‌ వస్తుండటంతో వారు కుళ్లుకుంటున్నారంటూ ఆగ్రహంను దిల్‌రాజు వ్యక్తం చేశాడు. దిల్‌రాజు డైరెక్ట్‌గా పవన్‌ ఫ్యాన్స్‌ను మే ఎత్తి చూపకున్నా ఆయన మాటలు పరోక్షంగా పవన్‌ ఫ్యాన్స్‌కు తాకినట్లుగా ఉన్నాయి. దిల్‌రాజు వ్యాఖ్యలను పవన్‌ ఫ్యాన్స్‌ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి దిల్‌రాజు కుల్లుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. సోషల్‌ మీడియాలో ఆ విషయమై చర్చ జరుగుతుంది.

మరిన్ని వార్తలు

ఎట్టకేలకు భాగమతి అప్‌డేట్స్‌

సాయిధరమ్‌ తేజ్‌ చేసిన మరో ‘తిక్క’ సినిమా