ఎట్టకేలకు భాగమతి అప్‌డేట్స్‌

Anushka bhagmati movie first look release on june 30

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Anushka Bhagmati Movie First Look Release On June 30

అనుష్క ప్రధాన పాత్రలో ‘పిల్లజమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న చిత్రం ‘భాగమతి’ ఈ చిత్రం దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభం అయ్యింది. అయితే సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ ఇప్పటి వరకు రాలేదు. అసలు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందా అనేది కూడా ఇంకా అధికారికంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించలేదు. అన్ని విషయాల్లో చాలా రహస్యంగా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ చిత్రంకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. 

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘భాగమతి’ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రేపు అంటే జూన్‌ 30న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయినా కూడా కొన్ని సీన్స్‌ను రీ షూట్‌ చేయడం వల్ల ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ‘బాహుబలి’ చిత్రంలో దేవసేనగా నటించి అద్బుతమైన నటిగా పేరుతెచ్చుకున్న అనుష్క ఈ సినిమాతో మరోసారి ‘అరుంధతి’ రేంజ్‌ గుర్తింపును దక్కించుకుంటుందనే నమ్మకంతో చిత్ర యూనిట్‌ సభ్యులున్నారు.

మరిన్ని వార్తలు