అయ్యో అనుష్క.. ఇంకా ప్రయత్నం

bhagamathie-team-making-promotions-with-anushka-after-the-movie-flop

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

భాగమతి చిత్రంతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ‘బాహుబలి’ చిత్రంతో వచ్చిన క్రేజ్‌ కారణంగా ‘భాగమతి’ చిత్రానికి ఒక మోస్తరులో ఓపెనింగ్స్‌ దక్కాయి. అయితే రెండవ వారం నుండి కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం కలెక్షన్స్‌ను రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పించేందుకు ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగానే చేస్తున్నారు. అందులో భాగంగా అనుష్క మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు సక్సెస్‌ టూర్‌ అంటూ తెలుగు రాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్నారు. వారం రోజుల పాటు ఈ సక్సెస్‌ టూర్‌లో అనుష్క పాల్గొననుంది.

బాహుబలి చిత్రం కోసం కత్తి విద్యలు, గుర్రపు స్వారీ ఇలా అనేక విద్యలను నేర్చుకుని కష్టపడ్డ అనుష్క ఇప్పుడు కూడా తన కష్టాలను కంటిన్యూ చేస్తూ ఉంది. ‘భాగమతి’ చిత్రం కోసం దాదాపు రెండు సంవత్సరాల పాటు షూటింగ్‌ చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమా విడుదల తర్వాత కూడా అనుష్కను వదిలేయడం లేదు. ఆమెతో పబ్లిసిటీ, ప్రమోషన్స్‌ అంటూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. సినిమా ఫ్లాప్‌ అయ్యిందని ఇప్పటికే తేలిపోయింది. వచ్చిన కలెక్షన్స్‌కు తృప్తి చెందకుండా ఇంకా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సహజంగా ఇలా సక్సెస్‌ టూర్‌లకు హీరోయిన్స్‌ ఆసక్తి చూపించరు. కాని నిర్మాతల ప్రయత్నంకు తనవంతు మద్దతు అన్నట్లుగా అనుష్క కూడా వారికి సపోర్ట్‌గా నిలుస్తుంది.