క్రియేటివ్‌ డైరెక్టర్‌ మల్టీస్టారర్‌

krishna vamshi multi starrer movie with three heros

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ ఈమద్య కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాలను చేయడంలో విఫలం అవుతున్నాడు. ఈయన చివరి చిత్రం ‘నక్షత్రం’ దారుణమైన పరాజయం పాలైన విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత ఈ దర్శకుడు కాస్త గ్యాప్‌ తీసుకుని, ప్రస్తుతం తన తర్వాత సినిమా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాడు. మల్టీస్టారర్‌ కథాంశంతో కృష్ణవంశీ సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ప్రస్తుతం సినిమాకు సంబందధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. ముగ్గురు హీరోలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగు మరియు తమిళంలో ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేలా రెండు భాషల స్టార్స్‌ను ఈ చిత్రంలో నటింపజేయాలని దర్శకుడు కృష్ణవంశీ భావిస్తున్నాడు.

తెలుగు నుండి రానా, తమిళం నుండి మాధవన్‌ను ఇప్పటికే ఈ చిత్రం కోసం సంప్రదించడం జరిగింది. కథ నచ్చడంతో పాటు, దర్శకుడు కృష్ణవంశీపై నమ్మకంతో వారు ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. త్వరలోనే మూడవ హీరో ఎంపిక కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్న దర్శకుడు కృష్ణవంశీ వేసవిలో మల్టీస్టారర్‌ను సెట్స్‌పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్నో అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన కృష్ణవంశీ గత కొన్ని సంవత్సరాలుగా మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక కిందా మీదా పడుతున్నాడు. ఈ మల్టీస్టారర్‌ చిత్రంతో అయినా ఈ దర్శకుడు సక్సెస్‌ను దక్కించుకుంటాడా అనేది చూడాలి. టాలీవుడ్‌లో వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.