‘భాగమతి’ ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌

anushka bhagmati movie first look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
గత కొన్ని నెలలుగా అనుష్క ‘భాగమతి’ చిత్రం గురించి సోషల్‌ మీడియాలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో వార్తలు, పుకార్లు తెగ హల్‌చల్‌ చేస్తున్న విషయం తెల్సిందే. అనుష్క ‘భాగమతి’గా ఎలా ఉండబోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు అనుష్క లుక్‌ రివీల్‌ అయ్యింది. అనుష్క పుట్టిన రోజు సందర్బంగా ‘భాగమతి’ లుక్‌ను విడుదల చేయడం జరిగింది. ‘పిల్ల జమీందార్‌’ ఫేం అశోక్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ వేడుకలో ప్రభాస్‌ పాలుపంచుకోబోతున్నాడు. ఖచ్చితంగా ఈ చిత్రం అనుష్క కెరీర్‌లో నిలిచి పోయే సినిమా అవుతుందని సినీ వర్గాల వారు మరియు అనుష్క సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌ అదిరిపోయేలా ఉంది. అనుష్క లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అనుష్క ‘భాగమతి’గా మరో సారి స్టార్‌ హీరోలకు పోటీ ఇవ్వడం ఖాయం అంటూ ఫస్ట్‌లుక్‌ చూస్తుంటేనే అర్థం అవుతుంది. సంక్రాంతికి పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ చిత్రంకు పోటీగా అనుష్క ‘భాగమతి’తో రాబోతున్న విషయం తెల్సిందే.

anushka-bhagmati-movie-firs