రాస్ టేల‌ర్ హిందీ నైపుణ్యం…

sehwag and ross taylor twitter chating in hindi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విదేశీ ఆట‌గాళ్లు అనేక‌మంది ఐపీఎల్ ఆడుతుండ‌డంతో వాళ్ల‌కు భార‌త జాతీయ భాష హిందీతో అనుబంధం ఏర్ప‌డుతోంది. ఉత్త‌రాది ఆట‌గాళ్లు ఎక్కువ‌గా ఉండే ఐపీఎల్ టీముల్లో భాగ‌స్వామ్యులైన విదేశీ ఆట‌గాళ్లు హిందీభాష‌ను అర్ధంచేసుకోగ‌లుగుతున్నారు. భార‌త ఆట‌గాళ్లు మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్ లోనూ హిందీలో మాట్లాడుకుంటూ ఉండ‌డంతో కొందరు విదేశీ క్రికెట‌ర్ల‌యితే భాష బాగా నేర్చేసుకుంటున్నారు కూడా. వాళ్ల‌ల్లో న్యూజిలాండ్ క్రికెట‌ర్ రాస్ టేల‌ర్ ఒక‌రు. ఆయ‌న ఏకంగా హిందీలోలో ట్వీట్లు కూడా చేస్తున్నారు. టీమిండియాపై వ‌న్డే సిరీస్ లో అద్భుతంగా రాణించిన రాస్ టేల‌ర్ కు భార‌త మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కు మ‌ధ్య ట్విట్ట‌ర్లో స‌ర‌దా సంభాష‌ణ సాగుతోంది. టేల‌ర్ ను ద‌ర్జీతో పోల్చిన సెహ్వాగ్ కు హిందీలో బదులిచ్చాడు టేల‌ర్.

తాజాగా మూడో టీ20 కోసం మ్యాచ్ జ‌ర‌గ‌నున్న తిరువ‌నంత‌పురం వెళ్లింది న్యూజిలాండ్ జ‌ట్టు. అక్క‌డ మూసి ఉన్న ద‌ర్జీ దుకాణం ముందు కూర్చుని టేల‌ర్ ఫొటో దిగాడు. ఆ ఫొటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి సెహ్వాగ్ ను ఉద్దేశిస్తూ… రాజ్ కోట్ మ్యాచ్ త‌ర్వాత ద‌ర్జీ దుకాణం బంద్. ఇప్పుడు కుట్టే ప‌ని తిరువ‌నంత‌పురంలో… త్వ‌ర‌గా వ‌చ్చేయ్ అని స్పష్టంగా హిందీలో ట్వీట్ చేశాడు. టేల‌ర్ హిందీప్రావీణ్యం చూసిన సెహ్వాగ్ నీ హిందీకి ముగ్ధుడిన‌య్యాన‌ని టేల‌ర్ ను ప్ర‌శంసించాడు. అత‌నికి భార‌తీయ పౌరుడు హోదా ల‌భిస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అద్భుత‌మైన హిందీ నైపుణ్య‌మున్న టేల‌ర్ కూడా భార‌తీయుల్లానే ఆధార్ కార్డుకు అర్హుడ‌వుతాడా అని ట్వీట్ చేశాడు. దీనిపై యూఐడీఏఐ కూడా స్పందించింది. భాష‌తో సంబంధం లేద‌ని, కావాల్సింది నివాస‌హోదా అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్ లో వైర‌ల్ గా మారిపోయాయి.

sehwag and ross tayler twitter chatting

sehwag and ross tayler twitter chatting