అబ్బా… జీవిత మాట మార్చిందే

jeevitha rajasekhar reacts on chiranjeevi fighting issue

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగాస్టార్‌ చిరంజీవి, జీవిత రాజశేఖర్‌ దంపతుల మద్య జరిగిన వివాదం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలం పాటు మెగా ఫ్యామిలీ మరియు రాజశేఖర్‌ ఫ్యామిలీ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉన్నాయి. కాని ఇటీవల మెగా ఫ్యామిలీకి రాజశేఖర్‌ ఫ్యామిలీ దగ్గర అవుతుంది. రాజశేఖర్‌ నటించిన ‘గరుడవేగ’ చిత్రం ప్రమోషన్‌ కోసం చిరంజీవిని కలిసిన విషయం తెల్సిందే. రాజశేఖర్‌ మరియు జీవిత స్వయంగా వెళ్లి మరి చిరంజీవిని ఆయన ఇంట్లో కలవడం జరిగింది. ఇంటి వద్ద రాజశేఖర్‌ దంపతులకు చిరంజీవి స్వాగతం పలికి ‘గరుడవేగ’ చిత్రానికి ఆల్‌ది బెస్ట్‌ చెప్పడంతో పాటు, తమ అభిమానులకు గరుడవేగ చిత్రాన్ని ఆధరించాల్సిందిగా కోరడం జరిగింది.

తాజాగా గరుడవేగ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఊహించని దానికంటే ఎక్కువగా కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవిత మీడియాతో మాట్లాడటం జరిగింది. సినిమాకు మద్దతు తెలిపిన బాలకృష్ణ, చిరంజీవి గార్లకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సమయంలోనే మెగాస్టార్‌తో ఉన్న విభేదాలు పూర్తిగా సమసినట్లేనా అంటూ ఒక మీడియా మిత్రుడు ప్రశ్నించగా సమాధానంగా జీవిత మాట్లాడుతూ అసలు తమకు చిరంజీవి గారికి ఎప్పుడు గొడవ లేదని, ఇద్దరి మద్య ఎప్పుడు కూడా స్నేహపూర్వక వాతావరణం ఉందని జీవిత చెప్పుకొచ్చారు. తాము ఎప్పుడు కూడా గొడవ పడలేదని, మా మద్య విభేదాల గురించి మీడియాలో వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అంటూ జీవిత చెప్పుకొచ్చింది. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మి మమ్ములను ప్రశ్నించవద్దని కూడా జీవిత అన్నారు.