ఈ వ‌య‌సులో నాకు ప్ర‌శాంతత కావాలి…

Amitabh Bachchan says peace in his old age

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నా జీవితంలో మిగిలి ఉన్న కొన్నేళ్లు నాతోనే గ‌డ‌పాల‌నుకుంటున్నాను. ఈ వ‌య‌సులో నాకు ప్ర‌శాంత‌త కావాలి. నా పేరు హెడ్ లైన్స్ లో వ‌చ్చినా తాను ప‌ట్టించుకోను. ఈ వ్యాఖ్య‌లు చేసింది బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ప్యార‌డైజ్ ప‌త్రాల జాబితాలో త‌న పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో బిగ్ బీ త‌న బ్లాగులో ఇలా స్పందించారు. అక్ర‌మ క‌ట్ట‌డాలు, ఆస్తుల విష‌యాల్లో త‌న‌కు నోటీసులు అందాయ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదని, ఒక్కోసారి వీటిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌నిపిస్తుంద‌ని, మ‌రోసారి అస‌లు స్పందించ‌క‌పోతే ఎలాంటి గొడ‌వ ఉండ‌ద‌నిపిస్తుంద‌ని అమితాబ్ వ్యాఖ్యానించారు.

స్కాంలలో ఇరుకున్నామంటూ కొన్నేళ్లుగా త‌న కుటుంబం గురించి వస్తున్న వార్త‌లు చూసి చాలా బాధ‌ప‌డ్డామ‌ని, ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నామ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తంచేశారు. విచార‌ణ‌లో భాగంగా త‌మ స‌మాధానాలు అడుగుతున్నార‌ని, ఇప్ప‌టివ‌ర‌కు రెండు స‌మాధానాలు ఇచ్చామ‌ని, త‌మ పేర్ల‌ను అనవ‌స‌రంగా ప్ర‌స్తావిస్తున్నార‌ని, ఇలాంటి కేసుల్లో తాము నిందితులుగా లేమ‌ని తాము ఇచ్చిన స‌మాధానాలు ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన త‌ర్వాత కూడా ప్ర‌శ్న‌ల వ‌ర్షం ఆగ‌లేద‌ని ఆయ‌న బ్లాగ్ లో పేర్కొన్నారు. ఈ వ‌య‌సులో త‌న‌కు ప్ర‌శాంత‌త కావాల‌ని, త‌న జీవితంలో మిగిలి ఉన్న కొన్నేళ్లు త‌న‌తోనే గ‌డ‌పాల‌నుకుంటున్నాన‌ని, త‌న పేరు హెడ్ లైన్స్ లో వ‌చ్చినా తాను ప‌ట్టించుకోన‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. ప్యార‌డైజ్ ప‌త్రాల్లోనే కాదు… గ‌తంలో అంత‌ర్జాతీయంగా తీవ్ర దుమారం రేపిన ప‌నామా పేప‌ర్స్, బోఫోర్స్ కుంభ‌కోణం వంటి వాటిలో కూడా అమితాబ్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది.