చిరంజీవి ఇంట్లో దొంగతనం.. అసలేం జరిగిందంటే!

robbery-in-megastar-chiranjeevi-house

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో దొంగలు పడ్డారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చిరంజీవి వ్యక్తిగత మేనేజర్‌ గంగాధర్‌ ఫిర్యాదు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి ఇంట్లో రెండు లక్షలు మాయం అయ్యాయి, ఇంట్లో నిన్న మొన్నటి వరకు పని చేసిన చెన్నయ్య అలియాస్‌ చిన్నా అనే వ్యక్తి ఈ దొంగతనం చేసినట్లుగా అనుమానిస్తున్నాం అంటూ మేనేజర్‌ గంగాధర్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. చిరంజీవి ఇంట్లో చిన్నా గత కొంత కాలంగా పీఏగా పని చేస్తున్నాడు. ఇంట్లో డబ్బును పెట్టిన సమయంలో చిన్నా దొంగిలించుకు పారిపోయాడు అని, ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు అంటూ గంగాధర్‌ చెప్పుకొచ్చాడు.
చిన్నాపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా వెదికే పనిలో పడ్డారు. ప్రస్తుతానికి అతడి మొబైల్‌ నెంబర్‌ స్విచ్‌ ఆఫ్‌ ఉంది. అతడి సొంత ప్రాంతంలో వెళ్లి ఎంక్వౌరీ చేయబోతున్నారు. మొత్తానికి చిరంజీవి ఇంట్లో దొంగతనం అనగానే పోలీసులు కాస్త హడావుడి చేస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీకి రెండు లక్షలు పెద్ద మ్యాటర్‌ కాదు. కాని ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకూడదు అనే ఉద్దేశ్యంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి ఉంటారు. మెగా వారి ఇంట్లో దొంగతనం అవ్వడం వల్ల వారం రోజుల్లోనే కేసును పరిష్కరించాలని ఉన్నతాధికారులు సైతం జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆదేశించడం జరిగింది. మూడు టీంలుగా విడిపోయి చిన్నా కోసం వెదకడం ప్రారంభించారు.