‘భోళాశంకర్’ నుంచి ‘తీనుమారు’ పాట రిలీజ్‌..?

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన కొత్త చిత్రం ‘భోళాశంకర్‌’ . మెహర్‌ రమేశ్‌ దర్శకుడు. తమన్నా కథానాయిక. చిరంజీవి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె మాట్లాడారు. ఈ లోపే మెగా అభిమానులను ఉర్రూతలూగించేలా ‘తీనుమారు’ అనే హుషారైన గీతాన్ని చిత్రబృందం ఈ సాయంత్రం విడుదల చేసింది.

ఈ పాట లిరికల్ వీడియో లింకును చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో పంచుకున్నారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా మహతి స్వరసాగర్ బాణీలు సమకూర్చారు .రాహుల్ సిప్లిగంజ్ ఆలపించాడు.

ఏకే ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర తెరకెక్కించిన ‘భోళా శంకర్’ నుంచి ఇప్పటివరకు రిలీజైన పాటలన్నీ ఆడియన్స్ లోకి బాగా చొచ్చుకుని వెళ్లాయి. ఈ పాట కూడా మెగా స్టయిల్లోనే ఉండడంతో అభిమానుల నుంచి విశేష స్పందన వస్తుందని చిత్రబృందం భావిస్తోంది.