కాజోల్ కుటుంబం లో టాబు నిప్పులు?

Tabu never married because of Ajay Devgan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
45 ఏళ్ళు దాటినా పెళ్లి ప్రస్తావన లేకుండా కాలం గడిపేస్తున్న అందాల సుందరి టాబు మనసులో ఏముందో ఇప్పటికి బయటపడింది. ఓ ఇంటర్వ్యూ లో ఆమె తాను పెళ్లి చేసుకోకపోవడానికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కారణమని చెప్పింది. ఈ ఇద్దరి గురించి రూమర్స్ కూడా వచ్చింది లేదు. అయినా హఠాత్తుగా ఇప్పుడు టాబు చాలా విషయాలు బయట పెట్టింది. ఒకప్పుడు అంటే ఇరవై ఐదేళ్ల కిందట టాబు కజిన్ సమీర్ ఇంటి పక్కనే ఉండేవాడట అజయ్. టబు ని అజయ్ ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండేవాడట. పైగా ఎవరైనా తనని చూస్తే వాళ్లకి అజయ్ చేతిలో దెబ్బలు పడేవట. అజయ్ తో తనకు మంచి ఫ్రెండ్ షిప్ ఉందని చెప్పిన టాబు తాను చిన్నపిల్లలా ప్రవర్తించినా బాగా చూసుకునే శక్తి అతనికి ఉందని కితాబు ఇచ్చింది. ఈ విషయాలన్నీ చెప్పి తాను పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ కారణమని టాబు బాంబు పేల్చింది.

యూత్ లో వుండే ఓ రకమైన ఆకర్షణ గురించి చెప్పేందుకు టాబు ఇలా సరదాగా అజయ్ ని సీన్ లోకి లాగింది. బాలీవుడ్ లో బుద్ధిమంతుడు అన్న టాగ్ తగిలించుకున్న అజయ్ దేవగన్ ఇమేజ్ కి టాబు వ్యాఖ్యలతో జరిగే డ్యామేజ్ ఎలా ఉంటుందో?. అంత కన్నా డేంజరస్ విషయం ఏమిటంటే… అజయ్ ని ప్రేమపెళ్లి చేసుకున్న కాజోల్ ఈ వ్యాఖ్యల్ని సరదాగా తీసుకుంటే సరి. లేదంటే కాజోల్ కాపురంలో టాబు నిప్పులు పోసినట్టే.

 మరిన్ని వార్తలు 

సాయిధరమ్‌ తేజ్‌ చేసిన మరో ‘తిక్క’ సినిమా

గంగాళం కోసం వీధినపడ్డ విశాల్ వదిన.

అందుకే ఆయనంటే ఇష్టం : బన్నీ