అందుకే ఆయనంటే ఇష్టం : బన్నీ

Allu Arjun said that He Like Ganta Srinivas Rao Very much

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 Allu Arjun said that He Like Ganta Srinivas Rao Very much

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవి హీరోగా తెరకెక్కిన ‘జయదేవ్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంకు సంబంధించిన ప్లాటినం డిస్క్‌ వేడుకను వైజాగ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ స్పెషల్‌ గెస్ట్‌గా పాల్గొన్నారు. ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కాగా, ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ పాల్గొనడంతో ప్లాటినం డిస్క్‌ వేడుక మంచి విజయవంతం అయ్యింది. ఇక అల్లు అర్జున్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్య కారణంగా గంటా శ్రీనివాస్‌పై ఉన్న అభిమానంగా చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. మంత్రి గంటా శ్రీనివాస్‌గారు అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చిరంజీవిని చాలా అభిమానిస్తారు. రాజకీయంగా చిరంజీవి గారికి చాలా అండదండగా నిలిచారు. ఆ తర్వాత కూడా వ్యక్తిగతంగా మాకు, మా కుటుంబంకు ఆయన చాలా సన్నిహితంగా ఉంటూ వస్తారు. ఏం చేసినా కూడా చిరంజీవి గారితో ఆయనకు సన్నిహితంగా సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. తమది చాలా లాంగ్‌ జర్నీ అని, అందుకే ఆయనపై అభిమానంతో ఈ వేడుకకు వచ్చాను అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక రవికి మంచి భవిష్యత్తు ఉండాలని, సినిమాల్లో రవి సక్సెస్‌ కావాలని కోరుకున్నట్లుగా బన్నీ అన్నాడు.

మరిన్ని వార్తలు:

అప్పుడు చిరు.. ఇప్పుడు బన్నీ

ఎట్టకేలకు భాగమతి అప్‌డేట్స్‌