సుప్రీమ్ తీర్పుతో జగన్ కి హుషారు.

jagan happy about supreme court judgment on social media posts

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియా ఓ పోస్టుల ఆధారంగా అరెస్టులు చెల్లవని సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తాజా తీర్పుతో వైసీపీ అధినేత జగన్ కి కొత్త ఉత్సాహం వచ్చింది. సంప్రదాయ మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబు కన్నా వెనుక పడ్డ జగన్ మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం వస్తుందని అంచనా వేసుకుని సోషల్ మీడియా మీద ప్రత్యేక దృష్టి సారించారు. దాని ఫలితమే ప్రస్తుతం తెలుగులో వున్న 100 కి పైగా వెబ్ సైట్స్ లో దాదాపు 90 శాతం జగన్ కి అనుకూలంగా నడుస్తున్నాయి. ఇక ఎప్పటినుంచో ఈ రంగం లో వున్న ప్రధాన వెబ్ సైట్స్ కూడా జగన్ వైపు స్టాండ్ తీసుకున్నాయి. ఇక ఈ వెబ్ సైట్స్ రన్ చేస్తున్న యు ట్యూబ్ ఛానెల్స్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని వాయువేగంతో ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదంతా దానంతట అది జరిగిపోతుందని, జగన్ అనుకూలురు ఇలా చేస్తున్నారని టీడీపీ భావిస్తున్నంట్లుంది. కానీ దీని వెనుక పెద్ద వ్యూహం, ప్రణాళిక వుంది.

2014 ఎన్నికల ఫలితాలు చూసాక కంగుతిన్న వైసీపీ వైఫల్యాల మీద జరిపిన పోస్ట్ మార్టం లో ప్రచార లోపం మరీ ముఖ్యంగా సోషల్ మీడియా లో బలహీనతలు బయటపడ్డాయి. ప్రోగ్రెసివ్ జనం సోషల్ మీడియా వేదికగా టీడీపీ అనుకూల ప్రచారం చేసినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ పరిణామం సహజసిద్ధంగా జరిగే దాకా ఎదురు చూడకుండా తామే ఉద్ధృత ప్రచారం సాగించాలని పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి అధినేత జగన్ ని ఒప్పించారు. ఆ ఫలితమే తెలుగులో వైసీపీ అనుకూల వెబ్ సైట్స్ తామరతంపరగా పుట్టుకొస్తున్నాయి. వీటికి వైసీపీ నుంచి ఆర్ధిక సహకారం తో పాటు సాంకేతిక సహకారం అందించేందుకు కూడా ఓ టీం పనిచేస్తోంది. కొందరు వైసీపీ నేతలు సదరు వెబ్ సైట్స్ ఆధ్వర్యంలో నడిచే యు ట్యూబ్ ఛానెల్స్ కి ప్రచారకర్తలుగా కూడా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయ మీడియాని ఫాలో కాకుండా కేవలం సోషల్ మీడియా ని మాత్రమే అనుసరిస్తే వైసీపీ ఆ అస్త్రాన్ని ఎంత దూకుడుగా వాడుతుందో అర్ధం అవుతుంది.

అయితే ఈ అస్త్రాన్ని టీడీపీ నిర్లక్ష్యం చేయడంతో వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి మరీ మోటు వ్యవహారాలకు దిగడంతో పొలిటికల్ పంచ్ రవికిరణ్ అరెస్ట్ దాకా దారి తీసింది. దీంతో వైసీపీ వెనక్కి తగ్గకపోయినా ఆ పార్టీ తరపున పని చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులు కాస్త స్లో అయ్యారు. ఇప్పుడు సుప్రీమ్ తీర్పుతో వారితో పాటు వారి వెనకున్న జగన్ లోను కొత్త హుషారు వచ్చింది.

జగన్ అండ్ కో కి కొత్త ఉత్సాహం ఇచ్చిన సుప్రీమ్ తీర్పు వెలువరించిన ధర్మాసనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ 2000 లోని సెక్షన్ 66 A ని కొట్టివేసింది. ఈ సెక్షన్ పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్చకీ భంగం కలిగిస్తోందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇది రాజ్యాంగం ఇచ్చే హక్కుని హరించడమేనని కూడా సుప్రీమ్ అభిప్రాయపడింది. సుప్రీం తీర్పు తర్వాత ఇక జగన్ సోషల్ మీడియా టీం ని కంట్రోల్ చేయడం అన్న ఆలోచన పక్కనబెట్టి అదే సోషల్ మీడియాలో తాము దూకుడుగా వ్యవహరించడం మీద టీడీపీ , చంద్రబాబు దృష్టి సారించాల్సివుంది.

 మరిన్ని వార్తలు 

గంగాళం కోసం వీధినపడ్డ విశాల్ వదిన.