Election Updates: తెదేపాలో చేరిన YS జగన్ సన్నిహితుడు

Election Updates: YS Jagan who joined TDP is a close friend
Election Updates: YS Jagan who joined TDP is a close friend

సీఎం జగన్ సన్నిహితుడు, SC కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు గురువారం తెదేపాలో చేరారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకొన్నారు. మంగళగరి గ్రామీణ మండలం కురగల్లుకు చెందిన బసవరావు ఆధ్వర్యంలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. గతంలో జగన్కు సంఘీభావంగా ఇడుపులపాయ నుంచి విశాఖపట్నం వరకు ఆయన 2వేల కి.మీ పాదయాత్ర చేశారు. జగన్ విధానాలతో విభేదించి SC కమిషన్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

చంద్రబాబు నేతృత్వంలో దళితుల అభివృద్ధి సాధ్యమని నమ్మి తాము తెలుగుదేశంలో చేరుతున్నట్లు వెల్లడించారు. SCల కోసం తెచ్చిన 27 పథకాలను జగన్ రద్దు చేశారని.. 188 మంది SCలను ఊచకోత కోశారని ఆరోపించారు లోకేశ్. కూటమి వచ్చాక SCలకు పూర్తి రక్షణ కల్పిస్తామని, దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. SCలకు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తామన్నారు.